లోక్ అదాలత్ సందర్భంగా సమీక్ష సమావేశం
RR: డిసెంబర్ 21న నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ సందర్భంగా షాద్ నగర్ కోర్టు కాంప్లెక్స్‌లో పోలీస్, బ్యాంక్ అధికారులతో 16వ జిల్లా అదనపు జడ్జి స్వాతి రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలని ఆదేశించారు. రాజీ మార్గం ద్వారా కేసుల సత్వర పరిష్కారం చేయడం జరుగుతుందన్నారు.