ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించాలి: కలెక్టర్

ప్రత్యేక అధికారులు గ్రామాల్లో పర్యటించాలి: కలెక్టర్

VZM: వాతావరణ పరిస్థితిపై జిల్లా అధికారులతో కలెక్టర్ డా,బి.ఆర్. అంబేద్కర్ ఇవాళ సమీక్షించారు. సోమవారం,మంగళవారం వర్షం కురిసే నేపథ్యంలో అధికారులు అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. మండల ప్రత్యేక అధికారులు, మండల అధికారులు గ్రామాల్లో పర్యటించి, నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నీటి పారుదల కాలువలు, పారిశుధ్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.