సీఐటీయూ ఆధ్వర్యంలో బస్ స్టేషన్ ఎదుట నిరసన

సీఐటీయూ ఆధ్వర్యంలో బస్ స్టేషన్ ఎదుట నిరసన

MNCL: ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం మంచిర్యాల బస్ స్టేషన్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి దుంపల రంజిత్ కుమార్ మాట్లాడుతూ.. ఆర్టీసీని ప్రైవేటీకరిస్తే ఊరుకోబోమని, ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె విరమణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు.