విద్యార్థిని అభినందించిన మంత్రి స్వామి

ప్రకాశం: టంగుటూరు మండలం ఆలకూరపాడు ప్రభుత్వ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థిని పుట్ట వెంకట భార్గవి ఇటీవల పదో తరగతి పరీక్ష ఫలితాల్లో 595 మార్కులు సాధించి రాష్ట్రస్థాయిలో మంచి ర్యాంకు సాధించింది. ఈ క్రమంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బాల వీరాంజనేయ స్వామి టంగుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆ విద్యార్థిని అభినందించి ఘనంగా సత్కరించారు.