సుతార్‌పల్లి గ్రామంలో ఉచిత వైద్య శిబిరం
MDK: రామాయంపేట మండలం సుతార్‌పల్లి గ్రామంలో సోమవారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాసాయిపేట మల్లేశం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే రోహిత్ రావు వివాహ మహోత్సవం పురస్కరించుకుని గ్రామంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక వైద్య బృందం వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.