175 మందికి ఇందిరమ్మ ఇళ్ల పట్టాలు అందజేత

KMM: వైరా నియోజకవర్గం పడమట నర్సాపురం గ్రామ రైతు వేదికలో ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ 175 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అదనంగా 10 మందికి రూ.3.28 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ప్రజల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు.