కమిటీ ఛైర్మన్‌గా చెంచయ్య నాయుడు ప్రమాణస్వీకారం
TPT: శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్గా రంగినేని చెంచయ్య నాయుడు, సభ్యులు శనివారం ఘనంగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ సందర్భంగా పీఆర్ అతిథి గృహం నుంచి మార్కెట్ యార్డ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర మంత్రి సవితమ్మ, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, బీజేపీ నేత కోలా ఆనంద్ తదితర ప్రముఖులు హాజరైయారు.