ఉమ్మడి జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు..

ఉమ్మడి జిల్లాలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు..

WGL: ఉమ్మడి వరంగల్ జిల్లాలో గత రెండు రోజులుగా వర్షాలు కురవలేదు. అయితే, రాబోయే రెండు రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ శనివారం తెలిపింది. ములుగు, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హనుమకొండ, జనగాం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.