మిషన్ భగీరథ నీటి సరఫరాలో అంతరాయం
MBNR: జాతీయ రహదారి నిర్మాణ పనుల కారణంగా మహబూబ్నగర్, నారాయణపేట్ జిల్లాల్లోని 258 గ్రామాలకు సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం సాయంత్రం వరకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోతుందని జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ శ్రీనివాస్ తెలిపారు. క్రిస్టియన్‌పల్లి వద్ద ఉన్న 1200 MM పైపైన్ను మార్చడం వల్లే ఈ అంతరాయం ఏర్పడుతుందని ఆయన వివరించారు. ప్రజలు సహకరించాలని కోరారు.