పాము కాటుతో వ్యక్తి మృతి
JGL: మల్యాల(M)కు చెందిన రాములు(55) పాముకాటుతో శుక్రవారం మృతిచెందినట్లు SI నరేష్ తెలిపారు. కాగా, మృతుడు కూలిపని చేస్తూ అప్పుడప్పుడు పాములు పట్టి జీవనం సాగిస్తాడు. ఈ క్రమంలో ఈనెల 19న ఓ విషసర్పాన్ని పట్టుకొని ఇంటికి తీసుకెళుతున్న సందర్భంలో అతని కుడిచేతిపై కాటువేసింది. దీంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు అతని భార్య పేర్కొంది.