ఘనంగా ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు
MDK: రామాయంపేట శ్రీ కళ్యాణ రామచంద్రస్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 22వ వార్షికోత్సవం పురస్కరించుకొని ఆలయ ప్రాంగణంలో గురువారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం పుణ్యాహవాచనం, అఖండ దీపారాధన, నిత్య హోమం, బాల భోగం కార్యక్రమాలను నిర్వహించారు. సాయంత్రం ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు.