ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించిన భీమ్ భరత్
RR: చేవెళ్ల నియోజకవర్గం పులుమామిడి గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ఇవాళ చేవెళ్ల నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ పామేన భీమ్ భరత్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే పేదవారి సొంతింటి కల సాకారం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.