ఏడుపాయల వన దుర్గమ్మ దివ్యదర్శనం
MDK: ఏడుపాయల వన దుర్గాభవాని మాత ఆలయంలో శుక్రవారం వేకువజామున అమ్మవారికి ఆలయ అర్చకుడు పార్థివ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. మంజీరా జలాలతో పవిత్ర అభిషేకం చేసిన అనంతరం, పట్టువస్త్రాలు, రంగురంగుల పూలతో మాతను సర్వాంగ సుందరంగా అలంకరించారు. సహస్రనామార్చన, కుంకుమార్చన వంటి విశేష క్రతువుల తర్వాత భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.