ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

ఉరి వేసుకొని యువకుడు ఆత్మహత్య

MDK: చేగుంట మండలం రెడ్డిపల్లి కాలనీలో ఉప్పు కార్తీక్(22) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు చేగుంట ఎస్సై-2 బిక్య నాయక్ తెలిపారు. రెడ్డిపల్లి కాలనీలో నివాసం ఉండే యాదగిరి కుమారుడు కార్తీక్ ఇంట్లోనే ఉరి వేసుకోగా ఆదివారం సాయంత్రం గుర్తించినట్లు వివరించారు. శవాన్ని పోస్టుమార్టం కోసం తూప్రాన్ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.