ప్రభుత్వ భూమి స్వాధీనం: తహశీల్దార్

ప్రభుత్వ భూమి స్వాధీనం: తహశీల్దార్

SDPT: అక్కన్నపేటలోని సర్వే నంబరు 387లో ఆక్రమణకు గురైన 30 గుంటల ప్రభుత్వ భూమిని తహశీల్దార్ మధుసూదన్ సోమవారం స్వాధీనం చేసుకున్నారు. కేజీబీవీ పాఠశాల సమీపంలోని ప్రధాన రహదారి పక్కన ఉన్న ఈ భూమిని గుర్తించి, చుట్టూ కంచె ఏర్పాటు చేయడంతో పాటు హద్దురాళ్లు పాతించారు. ప్రభుత్వ భూములను అక్రమంగా ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.