కర్నూలు విద్యార్థులు డీబార్
కర్నూలు: రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో శుక్రవారం జరిగిన యూజీ సీబీసీఎస్ పరీక్షల్లో చూచిరాతకు పాల్పడిన ముగ్గురు విద్యార్థులను డీబార్ చేసినట్టు యూనివర్సిటీ ఉపకులపతి వెంకట బసవరావు తెలిపారు. డోన్ ప్రభుత్వ డిగ్రీ మహిళా కళాశాల, శ్రీ సాయి డిగ్రీ కళాశాల, కోడుమూరు వివేకానంద డిగ్రీ కళాశాలల్లో ఒక్కొక్కరు చొప్పున విద్యార్థులు పట్టుబడి చర్యలు ఎదుర్కొన్నారు.