పులులు, ఏనుగుల సంరక్షణకు నిధులు విడుదల

పులులు, ఏనుగుల సంరక్షణకు నిధులు విడుదల

AP: రాష్ట్రంలో అంతరించిపోతున్న పులులు, ఏనుగుల సంరక్షణకు రూ.4 కోట్ల అదనపు నిధులు విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అటవీశాఖ ప్రతిపాదనలను ఆమోదిస్తూ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. అంతరించి పోతున్న పులులు, ఏనుగుల సంరక్షణకు ప్రాజెక్ట్‌ టైగర్‌, ప్రాజెక్ట్‌ ఎలిఫెంట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.