శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో విశేష పూజలు

శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో విశేష పూజలు

ATP: గుత్తి కోటలోని కొండపై వెలిసిన అతి పురాతనమైన శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతిని ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలోని స్వామివారి మూలమూర్తికి వేకువజామున పవిత్ర గంగా జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం తులసిమాలతో ప్రత్యేకంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పించారు. భక్తాదులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు.