'ఇందిరమ్మ రాజ్యంలో ప్రజలు ఆనందంగా ఉన్నారు'
BDK: భద్రాచలం సుభాష్ నగర్ కాలనీ, ముత్రాజ్ బజార్ కాలనీల్లో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ఇవాళ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పేద ప్రజల కోరిక నెరవేర్చుతుందన్నారు. ప్రజా ప్రభుత్వంలో ప్రజలు ఆనందంగా ఉంటున్నారని తెలిపారు.