ఈ బాలుడి ప్రాణం ఖరీదు రూ.16 కోట్లు

ఈ బాలుడి ప్రాణం ఖరీదు రూ.16 కోట్లు

KKD: గంగనాపల్లికి చెందిన 4 ఏళ్ల మోజెస్ రాయ్ స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ (SMA) టైప్-2తో బాధపడుతున్నాడు. ప్రస్తుతం విహాన్ చిల్డ్రన్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడికి నెలకు రూ. 50 వేలు ఖర్చవుతోంది. ఈ ప్రాణాంతక వ్యాధి నయం కావాలంటే రూ. 16 కోట్ల విలువైన జోల్‌జెస్మా ఇంజెక్షన్ అవసరమని వైద్యులు తెలిపారు. ఇంత భారీ మొత్తాన్ని భరించలేక ఆ తల్లిదండ్రులు సాయం కోసం ఎదురుచూస్తున్నారు.