ముగిసిన సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్

ముగిసిన సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్

ఢిల్లీలో అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సివిల్ డిఫెన్స్ విభాగం నిర్వహించిన మాక్ డ్రిల్ విజయవంతంగా ముగిసింది. ఇందులో భాగంగా నగరంలోని పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించడంతో పాటు, కొన్ని చోట్ల తాత్కాలికంగా విద్యుత్ సరఫరా నిలిపివేసి యంత్రాంగం సన్నద్ధతను పరీక్షించారు. విపత్తు సమయాల్లో ఎలా స్పందించాలో తెలుసుకునేందుకు చేపట్టిన ఈ ప్రక్రియ ప్రజలకు అవగాహన కల్పించింది.