సిరివెన్నెలతో నాది స్నేహబంధం: త్రివిక్రమ్

సిరివెన్నెల సీతారామశాస్త్రితో తనకున్న అనుబంధం గురించి దర్శకుడు త్రివిక్రమ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. 'నా ఉచ్ఛ్వాసం కవనం' కార్యక్రమానికి త్రివిక్రమ్ అతిథిగా హాజరయ్యాడు. ఆయన మాట్లాడుతూ.. సిరివెన్నెలతో తనది సినీ బంధం కాదని, ఒక గొప్ప స్నేహబంధమని చెప్పాడు. వారిది సుదీర్ఘ ప్రయాణమని తెలిపాడు. సిరివెన్నెల సాహిత్యం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని పేర్కొన్నాడు.