రైలు కింద పడి యువకుడి మృతి
KDP: ముద్దనూరు-కలమల్ల దారిలోని రైల్వే పట్టాలపై రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎర్రగుంట్ల జీఆర్పీఎఫ్ ఎస్సై భాస్కర్ రెడ్డి తెలిపారు. వేముల మండలం పెద్ద జూటూరుకు చెందిన మర్రిబోయిన నాగార్జున (30) రైలు వచ్చే సమయంలో పరిగెత్తుకుంటూ వచ్చి రైలు పట్టాలపై పడుకున్నాడని దీంతో రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందినట్లు లోకో పైలట్ తెలిపారని ఆయన చెప్పారు.