ఈనెల 13 వరకు రైతు బీమా దరఖాస్తులు

NLG: NLG మండలం తొరగల్ క్లస్టర్ పరిధిలోని రైతులు 2025-26 సంవత్సరానికి సంబంధించి రైతు బీమాకు దరఖాస్తు చేసుకోవాలని, AEO సత్యనారాయణ ఆదివారం తెలిపారు. 18 నుంచి 59 సం.ల వయస్సు గల పట్టా పాస్ బుక్, ఆధార్ కార్డ్, నామిని ఆధార్ కార్డ్ కలిగిన రైతులు అర్హులని పేర్కొన్నారు. ఈనెల 13 వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. రైతులు దరఖాస్తు స్వయంగా తీసుకురావాలన్నారు.