జనసేన ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
AP: జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను, తన మనుషులను టచ్ చేసే ధైర్యం ఎవడికీ లేదని వ్యాఖ్యానించారు. కొందరు తనపై వివక్ష చూపిస్తున్నారని.. ఎమ్మెల్యే సీటు ఎవరో త్యాగం చేస్తే రాలేదని, కష్టపడి తెచ్చుకున్నానని తెలిపారు. ఎవరికీ భయపడేది లేదంటూ హెచ్చరించారు.