వైభవంగా శ్రీ వినాయక ఆలయ ప్రథమ వార్షికోత్సవం

వైభవంగా శ్రీ వినాయక ఆలయ ప్రథమ వార్షికోత్సవం

NZB: కోటగిరి మండల కేంద్రంలోని వినాయక నగర్ సంకట విమోచన శ్రీ గణపతి ఆలయం ప్రథమ వార్షికోత్సవాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి ఆలయం వద్ద భక్తులు తరలివచ్చారు. వేద బ్రాహ్మణుల ఆధ్వర్యంలో నవగ్రహ పూజ, గణపతి హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.