మరోసారి జతకట్టనున్న ప్రభాస్, అనుష్క?

రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క మరోసారి కలిసి నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రభాస్ ప్రధాన పాత్రలో సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' మూవీ రాబోతుంది. ఈ సినిమాలో అనుష్క కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. సెకండాఫ్‌లో ఆమె పాత్ర వస్తుందని, చాలా కొత్తగా ఉంటుందని సినీ వర్గాల్లో టాక్. మరి ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.