జీవన్‌రెడ్డి చేరిక.. BRS క్యాడర్‌లో కొత్త ఉత్సాహం..!
JGL: మాజీ మంత్రి జీవన్‌రెడ్డి BRS పార్టీలో చేరడం ఖాయమైంది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. జీవన్‌రెడ్డి చేరికతో ఉమ్మడి జిల్లా రాజకీయాల్లో గులాబీ పార్టీకి మరింత బలం చేకూరుతుందని ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రాజకీయ పరిణామం గులాబీ పార్టీకి మేలు చేస్తుందని ఉమ్మడి జిల్లా క్యాడర్ ఉత్సాహంగా ఉన్నట్లు తెలుస్తోంది.