రెండో వన్డేకు ముందు BCCI కీలక నిర్ణయం
రెండో వన్డేకు ముందు BCCI కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 3న IND vs SA రెండో వన్డే ఆడనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌తో BCCI సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. BCCI సెక్రటరీ దేవజిత్ సైకియా, జాయింట్ సెక్రటరీ ప్రభ్‌తేజ్ సింగ్ ఈ సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం.