VIDEO: అమరావతిలో కార్డాన్ సెర్చ్
GNTR: అమరావతి పరిధిలో పోలీసులు కట్టుదిట్టమైన కార్డాన్ సెర్చ్ ఆపరేషన్స్ చేపట్టారు. తుళ్లూరు మండలం ఐనవాళ్లు గ్రామంలో టిడ్కో గృహాల వద్ద 2 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. రిజిస్ట్రేషన్ లేకుండా తిరుగుతున్న 16 వాహనాలు గుర్తించారు. గంజాయి ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. ప్రజలు సమస్యలు ఉంటే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు.