వంతెన దాటుతూ యువకుడు గల్లంతు

అల్లూరి: మన్యంలో కురుస్తున్న వర్షాల కారణంగా నీటి ప్రవాహంతో మోదాపుట్టు వంతెన వద్ద వాగు ఉగ్రరూపం దాల్చింది. మోదాపుట్టు నుంచి అడ్డుమండ వెళ్తున్న అదే గ్రామానికి చెందిన కుమారస్వామి(30) వంతెన దాటుతుండగా కాలుజారి పడి కొట్టుకుపోయాడని స్థానికులు తెలిపారు. ఇప్పటివరకు అతని ఆచూకీ తెలియరాలేదు. కుటుంబ సభ్యులు, గ్రామస్థులు కుమారస్వామి కోసం అన్వేషిస్తున్నారు.