'నర్సంపేటలో ముందస్తు వినాయక చవితి వేడుకలు'

WGL: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం NSS ఆధ్వర్యంలో ముందస్తు వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా NSS బాధ్యులు మాట్లాడుతూ.. రంగుల వినాయకుల నిమజ్జనం వల్ల నీరు కలుషితమై, జలచరాలు మరణిస్తాయని, పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందని తెలిపారు. మట్టి వినాయకులను పూజించాలని విద్యార్థులకు సూచించారు.