VIDEO: ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమం
విశాఖ దక్షిణలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా సంతకాల సేకరణ ఉద్యమం బుధవారం హోరెత్తింది. మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో 14వ వార్డుల్లో చేపట్టిన రచ్చబండ కార్యక్రమంలో సేకరించిన 60,000 సంతకాల ప్రతులను భారీ బైక్ ర్యాలీతో జిల్లా కార్యాలయానికి అందించారు. ప్రైవేటీకరణతో పేదలకు ఉచిత వైద్యం దూరమవుతుందని వాసుపల్లి అన్నారు.