జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎన్.లలిత

JN: దేవరుప్పుల మండలం మాదాపురం గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాల హెచ్ఎం ఎన్.లలిత జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా బుధవారం కలెక్టరేట్‌లో జరిగిన గురుపూజోత్సవం కార్యక్రమంలో కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ చేతుల మీదుగా వారు అవార్డు అందుకున్నారు. కాగా పాఠశాలలో 21 విద్యార్థుల నుండి 90 మంది విద్యార్థులు పెంచే విధంగా వారు కృషి చేశారు.