VIDEO: అడ్డంగా లారీలు.. ప్రయాణికులకు ఇబ్బందులు
NLR: కోవూరు నియోజకవర్గంలో వరి కోతలు జోరుగా సాగుతున్నాయి. అయితే గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే అంతర్గత రహదారులపై లారీలను అడ్డదిడ్డంగా నిలిపి ధాన్యాన్ని లోడ్ చేసుకుంటున్నారు. దీంతో బుచ్చి, రాజుపాలెం రహదారిలో ప్రయాణిస్తున్న వాహనదారులు అవస్థలు పడుతున్నారు. సింగల్ రోడ్డు కావడంతో ప్రమాదాలు జరిగే పరిస్థితి ఉంటుందని వాహనదారులు వాపోతున్నారు.