రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు

రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు

కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించడం, అక్రమ రవాణాను అడ్డుకోవడం, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ఎస్సై నాగరాజు బుధవారం వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అన్ని వాహనాలను ఆపి డ్రైవింగ్ లైసెన్స్, ఆర్‌‌సీ (RC), పొల్యూషన్, ఇన్‌షూరెన్స్ వంటి కీలక పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించారు. హెల్మెట్ ధరించని వాహనదారులపై చలాన్‌లు విధించారు.