కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్
NGKL: స్థానిక పురపాలక సంఘంలో ఖాళీగా ఉన్న కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైనట్లు మున్సిపల్ కమిషనర్ షేక్ మహమ్మద్ తెలిపారు. మొత్తం నలుగురు సభ్యులను ఎన్నుకోనుండగా, మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ అర్హత పత్రాలతో దరఖాస్తులను కల్వకుర్తి పురపాలక కార్యాలయంలో నేరుగా సమర్పించాలని సూచించారు.