భారీగా పోలీసుల బదిలీలు

మన్యం: సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా 74మంది పోలీస్ సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీలు చేశారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ మాధవ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లలో గత ఐదు సం.పై బడి పనిచేస్తున్న సిబ్బందిని జిల్లా వ్యాప్తంగా బదిలీ చేశారు. నలుగురు ఎఎస్సైలకు, 24 మంది హెచ్.సిలకు, 26 మంది కానిస్టేబుళ్లకు బదిలీలు జరిగాయి.