ఎలక్ట్రికల్ సైకిల్‌ను అందజేసిన ఎమ్మెల్యే

KNR: రామడుగు మండలం వెలిచాల అనుబంధ గ్రామం గుడ్డేలుగులపల్లికి చెందిన గిత్త సాయిచరణ్ అనే యువకుడు పూర్తి దివ్యాంగుడు. కళాశాలకు ఆర్టీసీ బస్సులో వెళ్లడానికి తనకు ఇబ్బంది అవుతుందని ఎలక్ట్రికల్ ఛార్జింగ్ వెహికల్ కోసమని రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కలిశారు. ఆయన వెంటనే స్పందించి అతడికి వెహికిల్‌ను అందజేశారు.