కుల్సుంపుర ప్రభుత్వ పాఠశాల వద్ద చీకట్లు

HYD: కుల్సుంపుర ప్రభుత్వ పాఠశాల వద్ద చీకట్లు అలుముకుంటున్నాయి. గత 20 రోజులుగా వీధిలైట్లు వెలగడం లేదని స్థానికులు తెలిపారు. రాత్రిపూట అటువైపుగా వెళ్లాలంటే భయంగా ఉందని వాపోతున్నారు. దీనికితోడు కుక్కల బెడద కూడా ఎక్కువైందన్నారు. సంబంధిత సిబ్బంది, అధికారులు స్పందించి నూతన వీధిలైట్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.