రక్త దాతలుగా… రక్షక భటులు
NLG: పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజారక్షణలో నిరంతరం పనిచేసే పోలీసులు విధి నిర్వహణతో పాటు రక్తదానం చేసి, మరికొందరికి ప్రాణదాతలుగా మారటానికి సిద్ధమయ్యారు. వారి స్ఫూర్తికి తాము కూడా సై అంటూ యువకులు తరలివచ్చి రక్తదానం చేశారు.