నేటి నుంచి వినాయక మండపాలకు ఉచిత విద్యుత్

VZM: నేటి(బుధవారం) నుంచి ప్రారంభమయ్యే వినాయకనవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆయా విగ్రహాల మండపాలకు ఉచిత విద్యుత్‌ను అందిచనున్నట్లు APEPDCL సూపరింటెండెంట్ ఇంజనీర్ లక్ష్మమణరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు గ్రామీణ ప్రాంతాలకు 3KW, పట్టణాలకు 5KW వరకు ఉచిత లోడ్‌ను మంజూరు చేయనున్నట్లు తెలిపారు. స్థానిక విద్యుత్ సిబ్బందిని సంప్రదించాలన్నారు.