VIDEO: చివరి ఆయకట్టు వరకు నీరందాలి: హరీశ్ రావు
MDK: నంగునూర్ మండల రైతుల సాగునీటి కష్టాలపై మాజీ మంత్రి హరీశ్ రావు తక్షణమే స్పందించారు. రంగనాయక సాగర్ కుడి కాలువలో పూడిక పేరుకుపోవడంతో నీటి ప్రవాహం 310 క్యూసెక్కుల నుంచి 115 క్యూసెక్కులకు పడిపోయింది. దీంతో పొలాలు ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేయగా ఇరిగేషన్ ఎస్‌ఈ సుధాకిరణ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు.