VIDEO: భైరవకోనకు తరలివచ్చిన నాగ సాధువులు, అఘోరాలు
ప్రకాశం: చంద్రశేఖరపురం మండలంలోని ప్రముఖ శైవ క్షేత్రం భైరవకోనకు కార్తీక పౌర్ణమి సందర్భంగా అఘోరాలు, నాగ సాధువులు తరలివచ్చారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారు భక్తులను ఆకర్షించగా, శ్రీ భైరవేశ్వర స్వామి మరియు త్రిముఖ దుర్గాంబ దేవికి నాగ సాధువులు, అఘోరాలు ప్రత్యేక పూజలు చేశారు.