గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

WGL: జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓవ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన రాయపర్తి మండల కేంద్రములో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రానికి చెందిన బొమ్మెర సతీష్ (35) అనే వ్యక్తీ రహదారి దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు