దుర్గామాత ఆలయంలో ఆభరణాలు చోరీ
MHBD: పెద్దవంగర మండల కేంద్రంలోని దుర్గామాత ఆలయం తాళాలు పగలగొట్టి దుర్గామాతకు అలంకరించిన వెండి, బంగారం ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో ఆలయ పూజారి యాకయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చిలువేరు ప్రమోద్ కుమార్ గౌడ్ సోమవారం తెలిపారు.