ఉదయగిరిలో బయటపడిన పురాతన రాతి విగ్రహాలు

ఉదయగిరిలో  బయటపడిన పురాతన రాతి విగ్రహాలు

NLR: ఉదయగిరి మినీ స్టేడియం అటవీ ప్రాంతంలో పురాతన విగ్రహాలు లభ్యమయ్యాయి. ఇటీవల గండిపాలెం మార్గం వైపున 167 BG హైవే రోడ్లు నిర్మాణ పనులను గుత్తేదారులు చేపట్టారు. పనులు చేపడుతున్న సమయంలో కాలగర్భంలో కలిసిన ఓ ఆలయం రాతి విగ్రహాలు బయటపడ్డాయి. యంత్రాలు పనిచేస్తున్న సమయంలో పెకిలించడంతో రాతి విగ్రహాలు ముక్కలయ్యాయి.