గుర్తు తెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతి

అన్నమయ్య: పీలేరు మండలం కామాటంపల్లె అంగన్వాడీ పాఠశాల సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించడంతో స్థానికంగా కలకలం రేగింది. ఇవాళ పాదచారులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించగా, మృతుడు బిక్షాటకుడిగా గుర్తించారు. శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.