టీబి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

టీబి నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

VSP: ప్రమాదకరమైన క్షయవ్యాధిని దేశం నుంచి పూర్తిగా తరిమికొట్టాలని ఫిషర్‌మన్ కాలనీ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్ సాయి చరణ్ పిలుపునిచ్చారు. ఎంవీపీ కాలనీ రైతుబజార్‌లో టీబి ముక్త భారత్ అభియాన్ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. రెండు వారాలకి పైగా దగ్గు, రక్తకఫం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.