చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై కఠిన చర్యలు

BHPL: రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బుధవారం ఎస్సై సందీప్ కుమార్ హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. నిషేధిత తంబాకు, గుట్కా విక్రయాలు, పేకాట, మద్యపానం వంటి విషయాలపై సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరారు.